బండ్లగూడలో భారీ చోరీ
బంగారం, నగదు దోపిడీ
హైదరాబాద్,అక్టోబర్27 ( జనం సాక్షి); రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బండ్లగూడ, శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండే శ్రీదేవి అనే మహిళ నెల రోజుల క్రితం కంటి చికిత్స కోసం వెళ్లింది. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపులు తీయగా ఇంట్లో సామాగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలతోపాటు, లక్షన్నర రూపాయల నగదు ఎత్తుకుపోయినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.