బతుకమ్మ చీరల పంపిణీ :ఎం పి పి శ్వేత రవిందర్ రెడ్డి

నాంపల్లి సెప్టెంబర్ 28 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ గురువారం నాంపల్లి మండల మల్లపురాజు పల్లి గ్రామానికి ఎం పి పి ఏడుదోడ్ల శ్వేత రవిందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి ,ఎం పి డి వో రాజు,ఉప సర్పంచ్ గోగు శ్రీను తదితరులుపాల్గొన్నారు.