బాల్క సుమన్ కు సవాళ్లు విసిరిన డాక్టర్ రాజా రమేష్

నియోజక వర్గం లో ఆదివాసీలను గుర్తించని ఎమ్మెల్యే సుమన్ సిగ్గు పడాలి.

చెన్నూరు నియోజకవర్గం లో మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ బాల్క సుమన్

గెలిచింది చెన్నూరు లో వుండేది హైదరాబాద్ లో నా…

నియోజకవర్గంలో లేనప్పుడు ఎమ్మెల్యే జీతం ఎందుకు…?

చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు

చెన్నూర్, ఆగస్టు 3, (జనంసాక్షి) :
చెన్నూరు నియోజక వర్గం లో ఆదివాసీ గిరిజన ప్రజలు ఉన్నారు అని బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తెలియక పోవడం సిగ్గు చేటు అని, నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో నివాసం వుంటున్న ఆదివాసీ, గిరిజన ప్రజల ఇండ్లకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు విమర్శించారు. కులిన ఇండ్లలో నివాసం వుంటున్న ఆదివాసీ గిరిజన ప్రజలకు ఆరు వందల నుండి వెయ్యి రూపాయల విద్యుత్ బిల్లులు వడ్డించడం నిరంకుశ నిజాం పాలనను చూపుతుంది అని, ఈ రోజుల్లో విద్యుత్ సరఫరా లేని గ్రామాలు వుండటం పై సుమన్ సమాధానం చెప్పాలి అని నిలదీశారు.

చెన్నూరు నియోజకవర్గం లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ( ఇంటింటికీ స్వచమైన మంచి నీరు) మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయో బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చూపించాలి అని చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు ప్రశ్నించారు..? నా చెన్నూరు ప్రజలు తాగే నీరు నీవు ఒక్క రోజైనా తాగి చూసావా అని, నీకు తాగడానికి పనికి రాని నీళ్ళు నా ప్రజలు ఎలా తాగుతారు అని విమర్శించారు.
ఈ ప్రాంత ప్రజల ఓట్లతో తో గెలిచి హైదరాబాద్ లో తిరుగుతున్న బాల్క సుమన్ కి ఎమ్మెల్యే జీతం ఎందుకు అని నిలదీశారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజల కష్టాలను, శ్రమను, చెమటను, రక్తాన్ని డబ్బు గా మార్చుకుంటున్న సుమన్ కు చెన్నూరు ప్రజలు తరిమికొట్టి తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, చెన్నూరు అభివృద్ధి ని, నియోజక వర్గ ప్రజల కష్టాన్ని పట్టించుకోని సుమన్ ను ఇక్కడ నుండి పంపితే తప్ప ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదు అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాల ప్రజలకు పంచడంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వ ఆంతర్యం ఏమిటి అని, అగ్నికి ఆహుతి అయ్యి, బులెట్లకు ఎదురు నిలిచి రాష్ట్రన్ని సాధించుకుంటే రక్షాసుల పాలైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

పేద వాడికి అండగా వుండేది కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

తాజావార్తలు