బిజెపిని అణచివేసే కుట్రలో కెసిఆర్‌

\

కుటుంబ పాలనపై పోరాడుతూనే ఉంటాం
ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకుని పాలన
మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి
న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ బీజేపీని అణిచివేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రన్నారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్‌ చేరదిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను అవాస్తవాలుగా.. అబద్దాలను నిజంగా చెప్తున్నారన్నారు. విూడియా సంస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవుస్తుందన్నారు. ప్రధాని పార్లమెంట్‌లో మాట్లాడిన అంశాలను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యకత్‌ం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించిన చానెల్‌పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్‌ వెల్లడిరచారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తమపై
దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి.. బీజేపీ కార్యకర్తలపై దాడులను ప్రేరేపిస్తున్నాడని అన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన బెట్టుకున్న కేసీఆర్‌.. ఉద్యమకారులను పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలు అయినందునే వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని పత్రికలను తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. తన పత్రికలో ప్రధాని మోడీ వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచురించిన విషయంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ అన్నారు. బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గ్దదె దించాలని భావిస్తున్నారన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే సత్తా.. కేసీఆర్‌కు లేదని సంజయ్‌ రౌత్‌ అన్నారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని తరుణ్‌చుగ్‌ పేర్కొన్నారు.