బిజెపి కోరుకున్న విధంగా మహా పరిష్కారం

శివసేనతో పాటు, కాంగ్రెస్‌,ఎన్సీపీలకు చెక్‌
రాష్ట్రపతి పాలనలో బిజెపి పక్కా వ్యూహం
న్యూఢిల్లీ,నవంబర్‌14(జనం సాక్షి): మహారాష్ట్రలో తాను అధికారం చేపట్టే అవకావం లేనప్పుడు, అక్కడ ఇతర పార్టీలను కూడా దానికి దూరంగా ఉంచాలన్న బిజెపి ప్లాన్‌లో భాగంగానే రాష్ట్రపతి పాలన వచ్చిందనడంలొ సందేహం లేదు. ఇప్పుడు రాజకయీ పార్టీల్లోనూ ఇదే చర్చగా ఉంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ లను అధికారంలోకి రానీయకుండా చేయడంతో పాటు, శివసేన తలబిరుసు అణచాలన్నది అమిత్‌ షా వ్యూహంగా ఉంది. శిసేనతో ముందు నుంచి మోడీ కొంత అటుఇటుగానే ఉన్నారు. ముంబైలో వారు పాగా వేయడాన్ని మోడీ ద్వయం జీర్ణించుకోవడం లేదు. అందుకే కలసి పోటీ చేసినా అధికారం తమ చేతుల్లోనే ఉండాలన్నది వారి ఆలోచన. అయితే శివసేన ఎదురు తిరగడంతో ఇప్పడు బిజెపి మార్చిన వ్యూహంతో
రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యింది. ఒకవేళ కాంగ్రెస్‌,ఎన్సీపలతో జతకట్టి అధికారంలోకి శివసేన రావాలని చూసినా దానికి విరుగుడు కూడా బిజెపి కనిపెట్టి ఉంటుంది. సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి సర్వసాధారణ మైందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రజానీకంపై రాష్ట్రపతి పాలన రుద్దడానికి రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం అని సహజంగానే లెఫ్ట్‌ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన ద్వారా ఎంఎల్‌ఏలపై అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకురావడం, బేరసారాలు సాగించడం ఏదో రకంగా శాసనసభలో పైచేయి సాధించడం బిజెపి వ్యూహం అని ఆరోపిస్తున్నాయి. పొరపాటున అక్కడి ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎంత నష్టం! మళ్లీ కుర్చీ లాక్కునేందుకు ఎన్ని వ్యూహాలు పన్నాల్‌ఇస ఉంటుంది. అందుకే బరి తెగించి, గవర్నర్‌ను కీలుబొమ్మను చేసి, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆ ఇద్దరిపై స్థానిక నేతలు విరుచుకు పడుతున్నారు. శివసేన కానీ, ఎన్‌సిపి కానీ నిర్దిష్ట సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు స్పష్టంగా చెప్పలేదు. అదనపు సమయం కావాలని మాత్రమే అడిగారు. స్పష్టమైన మెజార్టీ లేనప్పుడు విస్తృతమైన చర్చలే కదా విభిన్న పార్టీల మధ్య కనీస అవగాహనకు, ఉమ్మడి ప్రణాళికకు బాటలు వేసి సుస్థిరతకు దోహదం చేస్తాయి. దీనికి అవకాశం ఇవ్వమని అడగడమే వైఫల్యానికి చిహ్నమా? ఆ దిశలో చర్చలు జరుగుతండగానే అన్ని మార్గాలు మూసుకు పోయాయన్న నిర్ణయానికి గవర్నర్‌ ఎలా వచ్చారు? పోనీ ప్రత్యామ్నాయాలు లేవా? శాసనసభ సంఖ్యాబలంలో నాల్గవ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి గవర్నర్‌ కార్యాలయం నుండి అసలు ఆహ్వానమే రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడానికి బిజెపికి 48 గంటలు, శివసేనకు 24 గంటలు, ఎన్‌సిపికి అంతకన్నా నాలుగైదు గంటలు తక్కువ ఇచ్చారు.  ఇది సమాన అవకాశాలను తిరస్కరించడం.. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ధిక్కరించడం  అని అంటున్నారు. నిజానికి ఎన్నికల ఫలితాల తరువాత ఇలా
చర్చలు జరగడం, పరస్పరం భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమూ కొత్తేమి కాదు. గవర్నర్లను ఇలా చెప్పుచేతుల్లోకి తీసుకోవడం, వారిని కీలుబోమ్మలుగా మార్చి రాజకీయ పబ్బం గడుపుకోవడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి ఏ మాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను ప్రతిఘటించడానికి లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఉద్యమించాలని కోరుతున్నాయి.