బీఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నడా. ఆయుష్ తన్వీర్
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి అమలు
టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్టు 25 ::::
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి అమలు అవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిల్చాయని టీఎస్ హెచ్డి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.
సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ గారి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం డా. ఆయుష్ తన్వీర్ 30 మంది మహిళలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . పార్టీలో చేరిన వారిని చింత ప్రభాకర్
పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ
ప్రభుత్వ సంక్షేమం , అభివృద్ధి చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి అమలు అవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ మీ మళ్ళీ ముఖ్యమంత్రి
ముచ్చటగా మూడోసారి చూడాలన్నారు. అందుకు మహిళలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, మాజీ CDC చైర్మెన్ విజేందర్ రెడ్డి ,నాగరాజ్ గౌడ్ ,కౌన్సిలర్ శ్రీకాంత్ ,శేకర్ , అజ్జూ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.