బీహార్‌, అసోంలలో కొనసాగుతున్న సహాయకచర్యలు

పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
న్యూఢిల్లీ,జులై24(జ‌నంసాక్షి): గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో అసోం, బీహార్‌ రాష్ట్రలను వరదుల  ముంచెత్తాయి. దీంతో అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.  వరదల వల్ల ఇప్పటికే  174 మంది మరణించారు. 1.09 కోట్ల మంది ప్రజలను వరద ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీహార్‌ రాష్ట్రంలో వరద విపత్తు వల్ల 106 మంది మరణించారు. అసోం రాష్ట్రంలో 68 మంది మృత్యువాత పడ్డారు. అసోంలోని కజిరంగ జాతీయ పార్కులో ఉన్న వన్యప్రాణుల్లో 204 ప్రాణులు వరదల్లో మరణించాయి. బీహార్‌ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 80.5 లక్షల మందిని సహాయపునరావాస శిబిరాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమాయక చర్యల నుముమ్మరం చేసింది. ఇకపోతే  దేశంలోని పలు రాష్టాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌, అసోం, మేఘాలయ రాష్టాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. సబ్‌ హిమాలయన్‌ రాష్టాలైన్ర పశ్చిమబెంగాల్‌, సిక్కిం, బిహార్‌లతో పాటు కోస్తా కర్ణాటక, కొంకణ్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. తూర్పు రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మధ్య మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని భారత వాతావరణశాఖ బుధవారం జారీ చేసిన బులెటిన్‌ లో పేర్కొంది. బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ ఘడ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముంది. అరేబియా సముద్రంలో కొన్నాళ్లపాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు.