భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సంతోషరావు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 10(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్,పెద్ది సుదర్శన్ రెడ్డి,చల్లా దర్మారెడ్డి,ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండ ప్రకాష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి. ప్రజా ప్రతినిధులు… పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రకాళి ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు.
Attachments area