భారత్ జపాన్ దేశాల మధ్య విదేశీ వాణిజ్యా అభివృద్ధి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. భారత్-జపాన్ దేశాల మధ్య విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసేందుకు సంయుక్తంగా కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణంయిచాయి. భారత్‌లో ఉన్న ప్రైవేట్ పరిశ్రమల్లో సాంకేతికతను అభివృద్ధిచేసేందుకు కృషిచేస్తున్న హెచ్‌ఐడీఏ సంస్థతో పాటు జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ జెట్రో ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తామని జపాన్ ప్రతినిధులు సతోరూ మిటానీ తెలిపారు.