భూ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ధర్మసమాజ్ పార్టీ-డిఎస్పి సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్.
సిద్దిపేట జిల్లా పరిధిలో నిర్మాణమైన అంతగిరి, మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ఇరిగేషన్ ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన ప్రజలందరిలో ఇంకా చాలా మందికి సరియైన నష్టపరిహారం, ప్లాట్లు, ఇల్లు, ప్యాకేజీ లు వెంటనే ఇవ్వాలని ధర్మసమాజ్ పార్టీ డిఎస్పి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కర్రోల్ల రవిబాబు మహరాజ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు నిర్మాణమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా సరియైన నష్టపరిహారం, ఇండ్లు, ప్యాకేజీ మరియు ప్లాట్లు అందక భూములు కోల్పోయిన పేద వర్గాల ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారని ఇది ప్రభుత్వానికి పట్టటం లేదని భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి నోట్ తయారు చేశామని చెబుతున్న జిల్లా ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు అని అనేక సార్లు తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ముంపు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని రాజ్యాంగబద్ధంగా కనీస జీవించే హక్కును కూడా కాలరాశి ఇచ్చిన పునరావాస కేంద్రాలలో కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంలో ముంపు బాధిత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన న్యాయం జరగక కోర్టులను సంప్రదించిన ముంపు బాధితులకు నేటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం శోచనీయం ఇప్పటికైనా ప్రభుత్వానికి ఈ ముంపు బాధితుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే వారిని పిలిచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగుతుంది. ఎందుకంటే ఈ భూములు కోల్పోయిన వారిలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం మూలాన ఈ సమస్యను పరిష్కరించడం లేదని డిఎస్పి భావించాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ముంపు గ్రామాల ప్రజల యొక్క ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. అదేవిధంగా ఈ మూడు ప్రాజెక్టుల కింద ఎన్ని వేల ఎకరాల భూమిని, ఎంత మంది రైతులు, ఎంత పరిహారాన్ని అందించారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా నాయకులు డి.బి. రాజు, యాదగిరి లు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షులు
కర్రోల్ల రవిబాబు మహరాజ్
DSP సిద్దిపేట జిల్లా కమిటీ