మంత్రి మల్లారెడ్డి ని నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానం
పలకిన అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ గృహ ప్రవేశ వేడుకలో ఆహ్వాన నిమిత్తం మంత్రి మల్లారెడ్డి ని బోయిన్ పల్లి లో ని ఆయన నివాసం వద్ద కలిసి ఆహ్వానం తెలుపగా మంత్రి మల్లారెడ్డి సానుకూలత వ్వక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అఫ్జల్ ఖాన్ కు శాలువా కప్పి సన్మానించారు.మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు పార్టి లో చురుకుగా కార్యక్రమాలు చేసే అఫ్జల్ ఖాన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు హరిమోహన్ రెడ్డి, మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.
10ఎస్పీటీ -1: అఫ్జల్ ఖాన్ ను సన్మానిస్తున్న మంత్రి