మందిర్‌ యహీ బనేగా..

గూగుల్‌ సర్చ్‌లో కనిపించే దృశ్యం
న్యూఢిల్లీ,డిసెంబర్‌ 1(జ‌నంసాక్షి):మందిర్‌ యహీ బనేగా. ఇప్పుడు ఈ టైటిల్‌ గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపిస్తోంది. వివాదాదస్పద బాబ్రీ మసీదు ప్రాంతాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. ఆ ప్రాంతంలో మందిర్‌ యహీ బనేగా అన్న స్లోగన్‌ కనిపిస్తున్నది. అంటే రామ మందిరాన్ని ఇక్కడే నిర్మిస్తామని అర్థం. గూగుల్‌ మ్యాప్‌లో అయోధ్యను సెర్చ్‌ చేస్తే ఈ టైటిల్‌ కనిపించడం చర్చాంశమైంది. మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్‌ అప్లికేషన్‌లో రామ జన్మభూమిని సెర్చ్‌ చేస్తే ఇలా చూపిస్తుంది. రాముడు ఇక్కడే జన్మించాడని, అక్కడే మందిరాన్ని నిర్మించాలని అనేక హిందుత్వ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పేజీకి 12 రివ్యూ కామెంట్స్‌ వచ్చాయి. ఫైవ్‌ రేటింగ్‌లో ఫోర్‌ పాయింట్స్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదం కోర్టులో ఉన్నది. అయితే యూజర్లు ఎడిట్‌ ఆప్షన్‌ను వాడుకుని టైటిల్‌ను ఫిక్స్‌ చేసి ఉంటారని గూగుల్‌ సంస్థ అనుమానిస్తుంది.