మమత కంఠలో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం
మోడీకి కలసవిచ్చేలా మమత యత్నాలు
కాంగ్రెస్, బిజెపిలను నిలువరించే శక్తి మమతకు సాధ్యమా
తాజా రాజకీయాల్లో మమతది అతివిశ్వాస ప్రయత్నం
న్యూఢల్లీి,డిసెంబర్3 (జనం సాక్షి) కాగల కార్యం గంధర్వులు తీర్చే అన్న రీతిలో..కాంగ్రెస్‌ను పాతిపెట్టాలన్న మోడీ లక్ష్యాన్ని మమతా బెనర్జీ తీర్చ బోతున్నారా అన్న సందేహం కలుగుతోంది. కాంగ్రెస్‌పైనా మమతా బెనర్జీ కక్షకట్టి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మమతా బెనర్జీ, ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సిఎం కెసిఆర్,శరద్ పవార్ వంటి వారంతా మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్‌పై తాజాగా మమతా బెనర్జీ కత్తి కట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కుటంబ పాలన సరికాదు. దీనిపైనా మోడీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సమయమున్నప్పుడల్లా హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా ప్రధాని మోడీ కాంగ్రెస్ వంశపరిపాలనపైనా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ గత ఏడేళ్లుగా ఆయన నినదిస్తున్నారు. కాంగ్రెస్‌లో కూడా నిరసన గళాలు వినిపిస్తున్నా..సీనియర్లు అలకబూనుతున్నా..లేఖలయుద్దం చేస్తున్నా రాహుల్ చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ ఏకకాలంలో అటు మోడీని..ఇటు కాంగ్రెస్‌ను ఢీకొంటుందా అన్నదే ప్రశ్న. ప్రాంతీయ పార్టీల కూటమి అంటే కప్పల తక్కెడ తప్ప మరోటి కాదు. ఎవరికి వారు ప్రధాని పదవి తమకే అన్న ధోరణిలో ఉంటారు. వీరందరినీ కూడగట్టడం ఒక ఎత్తయితే..నాయకత్వ బాధ్యతలను నిర్వహించడం మరో ఎత్తు. నిజానికి ఈ పరిస్థితులే మోడీని ఛాతీ విరుచుకునేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ పని అయిపోయిందనీ, ఇక తానే దేశానికి దిక్కని మమత పరోక్షంగా చేసిన హెచ్చరికలు అతిగానే ఉన్నాయని గుర్తించాలి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌తో భేటీ అయిన తరువాత, రాహుల్ గాంధీ విూద ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు గతంలో ఆమె రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలకు దగ్గరగా ఉన్నాయి. అందుకే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గ్దెదింపడం తేలికేననడం ఆమె అతి విశ్వాసానికి నిదర్శనంగా చూడాలి. బెంగాల్లో బిజెపిని నిలవరించినంత ఈజీకాదని ఆమె గుర్తించడం లేదు. యూపీఏ లేదని తేల్చేయడం ద్వారా మమత కాంగ్రెస్‌ను తక్కువచేసి మాట్లాడడం అందరి దృష్టీ ఆకర్షించారు. ఢల్లీి గద్దెవిూద ఎప్పటినుంచో మమత కన్ను ఉన్నదని అందరికీ తెలిసిందే. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతను ఓడిరచేందుకు బీజేపీ సర్వశక్తులూ ధారపోసింది. ఆమె హస్తిన దండయాత్రను నిలువరించేందుకేనని టీఎంసీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. బీజేపీని బలంగా ఢీకొట్టి, బెంగాల్ లో హ్యాట్రిక్ సాధించిన తరువాత మమతలో ఆత్మస్థయిర్యాన్ని పెంచివుండవచ్చు. రాహుల్‌కు రాజకీయం అర్థంకావడం లేదనీ, రోడ్లవిూదకు వచ్చి ఉద్యమాలు చేయపోతే మోదీ తనకుతానుగా ఓడిపోరని పీకే కూడా బెంగాల్ ఎన్నికల హోరు మధ్య వాపోయారు. కాంగ్రెస్ నాయకత్వంలో మోదీని గద్దెదింపడం జరగనిపని కనుక ప్రాంతీయపార్టీలన్నీ తనచుట్టూ చేరాలన్నది మమత ఆకాంక్షగా ఉంది. ఈ క్రమంలో ఈశాన్య రాష్టాల్లో ఆమె తన పార్టీని విస్తరిస్తోంది. మేఘాలయలో కాంగ్రెస్ సభ్యలును టిఎంసిలో చేర్చుకోవడం దీనికి నిదర్శనంగా చూడాలి. ఎక్కడైనా ఆమె కాంగ్రెస్ నూ, బీజేపీయేతర చిన్నాచితకా పార్టీలనే దెబ్బతీయగలరు. గోవాలో మాజీ ముఖ్యమంత్రులను చేర్చుకుంటూ, వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులకు పార్టీ కండువాలు కప్పుతూ ఎన్నికలకుముందు హడావుడి చేయడం మమతకు కొత్తేవిూకాదు. ప్రధానంగా, రాహుల్ విూద కక్షపూనినందున కాంగ్రెస్‌ను ఘోరంగా దెబ్బతీయడం ఆరంభించానని..ఇది తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ఇలా ఢల్లీి వెళ్ళి, అలా మోదీని దించేయబోతున్నట్టుగా మమత చేస్తున్న వ్యాఖ్యలు కొంత అతిశయంగానే ఉన్నాయి. అతిత్వరలోనే దేశస్థాయిలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని తృణమూల్ ఆక్రమించబోతున్నదని ఆమె ప్రకటించడం గమనార్హం. కానీ, కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడిరచాలను కోవడం పగటికలేనని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా కొట్టిపారేయలేం. దేశస్థాయిలో దానిని తృణమూల్‌తో పోల్చడం కూడా సరికాదు. మమతాబెనర్జీని జాతీయస్థాయి నాయకురాలిగా ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే ఆమెకు భాషాపరమైన ఇబ్బందులు తప్పవు. అలాగే ఉత్తరాదిలోనే మమతను అంగీకరిస్తారా అన్నది ముఖ్యం. దక్షిణాదిలో ఆమె ఎక్కడా చెల్లక పోవచ్చు. బీజేపీ వ్యతిరేకత, మోదీపై పోరాడే శక్తి వంటివి కొన్ని వర్గాలను ఆకర్షిస్తాయేమో కానీ మొత్తంగా తానే ప్రత్యామ్నాయం అన్నదగ్గ శక్తిగా ఆమె నిలవలేరన్నది గమనార్హం. బెంగాల్ లో ఐదేళ్ళక్రితం మూడుస్థానాలున్న బీజేపీ ఇప్పుడు డెబ్బయ్ స్థానాలకు చేరుకున్న పరిణామాలను తక్కువ వేయడానికి లేదు. దేశంలో వామపక్ష పార్టీలు కూడా బలంగా లేవు. కేవలం బీజేపీ వ్యతిరేకత, మోదీవిూద ఘాటైన విమర్శలు ఓట్లు కుమ్మరించవు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ మరోసారి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి గతంలో రాహుల్‌తో చర్చలు కూడా జరిపారు. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ, తరచూ ఆ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైనదన్నారు. అయితే గడిచిన పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఓ వ్యక్తికి గల దైవదత్తహక్కు కాదని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా మమతను బలపర్చేవిగా ఉన్నాయి. అదే క్రమంలో మోడీ భాషిస్తున్న కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి దగ్గరగా ఉన్నాయి. మమత చేస్తున్న ప్రయత్నంలో కాంగ్రెస్ దెబ్బతినవచ్చేమో గానీ మోడీ మాత్రం మరింత బలపడితే విపక్షాల ఐక్యత ఇక చెల్లాచెదురు కాగలదని గుర్తించాలి.