మరోసారి పెట్రోల్, డీజిల్‌పై ధరలను తగ్గించింది
అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ముడి చమురు ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్‌పై ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2, లీటరు డీజిల్‌పై 50 పైసల చొప్పున తగ్గాయి. ఈ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.61.20, కోల్‌కత్తాలో రూ.66.50, ముంబయిలో రూ.66.23, చెన్నరులో రూ.61.46కు తగ్గుతుంది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.44.45, కోల్‌కత్తాలో రూ.48.23, ముంబయిలో రూ.49.51, చెన్నరులో రూ.45.56గా నమోదు కానుంది.