మరో 11 రోజుల సమయం

జాబిల్లి చెంతకు చేరనున్న చంద్రయాన్‌-2
బెంగళూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 మరో 11 రోజుల్లో జాబిల్లి చెంతకు చేరనుంది. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విజయవంతంగా మరో దశను దాటింది. బుధవారం ఉదయం 9.04 గంటలకు మూడోసారి కక్ష్య కుదింపు పక్రియ చేపట్టారు. ప్రపల్షన్‌ సిస్టమ్‌ను 20 నిమిషాల పాటు మండించి వ్యోమనౌకను 179 లీ 1412 కిలోవిూటర్ల కక్ష్యలోకి తీసుకొచ్చారు. దీంతో చంద్రయాన్‌-2 జాబిల్లికి మరింత చేరువైంది. నాలుగో కక్ష్య కుదింపు పక్రియను ఆగస్టు 30 సాయంత్రం 6-7 గంటల మధ్య నిర్వహించ
నున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ విన్యాసం పూర్తయిన తర్వాత కక్ష్య ఆకారం గుండ్రంగా మారుతుందని వెల్లడించింది. సెప్టెంబరు 7న జాబిల్లిపైన దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్‌-2 అడుగుపెట్టనుంది.  ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే పక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమవుతుందనేది తెలిసిందే.