మళ్లీ మిగ్‌ నడపనున్న అభినందన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మళ్లీ మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడపనున్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీన పఠాన్‌కోట్‌లో వైమానిక దళం ఓ కార్యక్రమం నిర్వహించనున్నది. ఆ
రోజున బోయింగ్‌ ఏహెచ్‌-64ఈ అపాచీ గార్డియన్‌ అటాక్‌ హెలికాప్టర్లను వాయుదళంలోకి ఇండక్ట్‌ చేయనున్నారు. ఆ వేడుక సమయంలో అభినందన్‌ మిగ్‌ విమానాన్ని నడపనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్‌ వైమానిక దాడిలో అభినందన్‌ మిగ్‌ను నడిపారు. ఫైటర్‌ విమానాలు జరిపిన డాగ్గ్‌/యిట్‌లో.. ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్‌కు చెందిన మిగ్‌-21 పాక్‌లో కూలింది. పాక్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను తరుముతూ వెళుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న మిగ్‌-21 బైసన్‌ విమానం దారితప్పింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16ను అభి నేలకూల్చాడు. మార్చి 1వ తేదీన అతన్ని పాక్‌ రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత సెలవుల్లో ఉన్న అభినందన్‌ తిరిగి ఇటీవల విధుల్లో చేరారు. ఈ ఏడాది మే నెలలోనే అపాచీ గార్డియన్‌ హెలికాప్టర్లను బోయింగ్‌ అప్పగించింది.