మహారాష్ట్రలో బిజెపి నీతిమాలిన చర్యలు

అజిత్‌ లేఖతో రాజకీయ దిగజారుడుతనం

అర్థరాత్రి డ్రామాతో అభాసు పాలయిన కమలదళం

ముంబై,నవంబర్‌27  (జనంసాక్షి) : మహారాష్ట్ర పరిణామాలు ప్రజల ఊహకు అందనంతగా ఉన్నాయి. రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించాల్సిన కీలకస్థానాల్లో ఉన్నవారంతా కలసికట్టుగా మోసం చేశారు. బిజెపి వ్యవహరించిన తీరు చూస్తే ఎన్నడయినా ఇంత దారుణం జరిగిందా అన్న ఆవేదన ప్రజల్లో కలిగిస్తున్నది. ఎన్సీపి ఎమ్మెల్యేలందరినీ బీజేపీ పక్షాన మోహరిస్తూ అజిత్‌పవార్‌ ఇచ్చిన మద్దతు లేఖ సాంకేతికంగా సరైనదా, ఆయనకు ఆ అధికారం ఉన్నదా లేదా అన్న వివేచన చేసుకోకుండా బిజెపి నేత ఫడ్నవీస్‌ సిఎంగా ప్రమాణం చేయడంఅన్నది రాజ్యాంగాన్ని నకాలరాయడం తప్పమరోటి కాదు. అది ఎవరికోసమో ఉద్దేశించినదనీ, అజిత్‌ పవార్‌ దానిని దుర్వినియోగం చేశాడని పవార్‌ పక్షం అంటున్నది.

శనివారం వేకువజామున సంభవించిన పరిణామాలు ఎవరూ ఊహించనివి. పవార్‌ ముందురోజు చెప్పిన ప్రకారం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కలసి ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు పార్టీల మధ్యా కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో సాగుతున్న మంతనాలు ఒక కొలిక్కి వచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. ప్రజలు కూడా అదే జరుగుతందని అనుకున్నారు. కానీ, నిద్రలేచేసరికి ఎవరూ ఊహించని రీతిలో ముఖ్యమంత్రిగా ఫడణవీస్‌, ఉపముఖ్యమంత్రిగా బిజెపి రాజకీయ శత్రువు అజిత్‌ పవార్‌ పరమాణం చేశారు. శివసేన,కాంగ్రెస్‌,ఎన్సీపీలు ఒక్కటి కావడమే ప్రజాతీర్పును ఉల్లంఘించడమని బిజెపి ఎలా చెప్పగలుగుతుందన్నది ప్రశ్న. ఎన్నికలకు ముందు..ఎన్‌ఇనకల తరవాత అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ వీరి కలయికను తప్పుపట్టలేం.

అలా అనుకుంటే ఈ అర్థరాత్రి పరిణామాలు ప్రజాస్వామిక సంప్రదాయాలను, పక్రియలను నిలువునా పాతరేశాయని ఎవరిని అడిగినా చెబుతారు. అజిత్‌ పవార్‌ ఇచ్చిన లేఖలో పేర్కొన్నంత బలం తమపక్షాన వచ్చిచేరిందని బిజెపి పెద్దలంతా మనస్పూర్తిగా విశ్వసించిన పక్షంలో అంత త్వరగా సిఎం కుర్చీ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏముందన్నదే ప్రశ్న. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీ పక్షానవుంటే, కొద్దిగంటల్లోనే పవార్‌ పక్కన, సోమవారం రాత్రి ¬టల్‌లో నిర్వహించిన విూడియా పరేడ్‌లోనూ అంత పెద్దసంఖ్యలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడనుంచి వచ్చారన్న దానికి సమాధానం చెప్పాలి. మద్దతు లేఖలో గవర్నర్‌ కోషియారీకి కనిపించిన సంఖ్య క్షేత్రస్థాయిలో లేదన్న నిజాలు తెలియకకాదు. కేవలం కుటుంబ వైరాల నుంచి పుట్టిన ఈ లేఖ ఆధారంగా ఫడణవీస్‌ ఎలా సిఎం గద్దెను ఎక్కారన్నదే ప్రశ్న. రాష్ట్రపతి పాలన విధించడం, ఎత్తి వేయడం గతంలో కాంగ్రెస్‌ మాత్రమే చేయగలిగేది. ఇప్పుడు అదే దారిలో పయనించడం ద్వారా బిజెపి అనైతిక రాజకీయాలకు పాల్పడిందనే చెప్పాలి. మద్తు ఉందా లేదా అన్న జోలికి వెళ్లకుండా సుస్థిర పాలన అందించగలిగే ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాల్సిన గవర్నర్‌ మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు కేంద్రమంత్రివర్గ సిఫారసు ఉండాలన్న నిబంధనను దాటిపోవడానికి వీలుగా ప్రధాని తన అసాధారణ అధికారాలను ఉపయోగించి అనూహ్యమైన, అతిముఖ్యస్థితిలో మాత్రమే వాడాల్సిన ఓ నియమాన్ని వెలికితీశారు. రాష్ట్రపతి మారుమాట్లాడకుండా ఉదయాన్నే గవర్నర్‌ పాలనను ఎత్తేస్తూ ఆమోదముద్రవేయడం, ఆయన అసలు సంతకం లేకుండానే అధికారులు ఉత్వర్వులను అప్‌లోడ్‌ చేయడం, ¬ంశాఖ కార్యదర్శి డిజిటల్‌ సంతకం చేయడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని మరింత ఖూనీ చేశాయి. ఇటువంటి సంక్షోభ సందర్భాల్లోనే ఎవరు విలువలను తుంగలో తొక్కారన్నది ప్రజలకు వేరుగా చెప్పాల్సిన పనిలేదు. సమస్త వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయనీ ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తే ఏంజరుగుతుంది? ఇలాంటి పనులు ప్రజాస్వామ్యానికి చేటు తేగలవు. బిజెపి లాంటి పార్టీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడడం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.