మహిళా అథ్లెట్లకు మరింత ప్రోత్సాం అవసరం

క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు అవసరం
న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): భారత్‌ లాంటి విశాలమైన దేశంలో సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రామాల స్థాయిలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే మహిళా అథ్లెట్లు మరింత మంది ముందు
కొచ్చే అవకాశం ఉంటుంది. మెరుగైన శిక్షణ, పోషకాహారం లాంటి కారణాలతో ఇప్పటికీ దేశంలో క్రీడలు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెస్‌కు భారత్‌లో ఉండాల్సినంత ఆదరణ లేదని మహిళా చెస్‌ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మహిళాదినోత్సవ కానుకగా ప్రపంచకప్‌లో పాక్‌మై మనమహిళా క్రీడా జట్టు ఘనవిజయం సాధించింది. ఇదో శుభశూచకంగా చూడాలి. కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత దేశంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు చాలా మెరుగయ్యాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఇప్పటికీ దేశంలో క్రికెట్‌దే ఆధిపత్యం. అయితే, క్రీడా అభిమానులు, విూడియా పురుషుల క్రికెట్‌ జట్టుకు ఇచ్చినంత ప్రాధాన్యత, మహిళల జట్టుకు ఇవ్వడంలేదు. క్రికెటర్లకు వచ్చినంత గుర్తింపు ప్రపంచ, ఏషియన్‌, కామన్వెల్త్‌ ఛాంపియన్లకు రావడంలేదు. ఖేలో ఇండియా గేమ్స్‌లో బాలికలు పతకాలు సాధిస్తున్నారు. షూటింగ్‌లో పలు అంతర్జాతీయ పతకాలు సాధించిన 17 ఏళ్ల రామ్‌ కిషన్‌ భాకెర్‌ తమకు పెద్దగా ప్రచారం రావడం లేదని అంటోంది. మాలావత్పూర్ణ లాంటి వారెండరో పర్వతారోహణలో రాణించారు. దేశానికిపేరు తెచ్చారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలి. కొన్ని చిన్న గ్రామాల్లో ఆటల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. పోటీల గురించి కొంతమంది గ్రావిూణులకు తెలియదు. కానీ, కాస్త దృష్టి పెడితే ఆ ఊళ్లలోనే మెరుగైన ఆటగాళ్లు దొరుకుతారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి. అబ్బాయిల్లాగే తాము కూడా క్రీడల్లో రాణించగలమని పోరాడాలి. సాంస్కృతిక, సంప్రదాయ అవరోధాల ను అధిగమించాలి. మహిళలు స్వయం శక్తి దిశగా ఎదిగేలా పథకాలను కేంద్రం తీసుకుని రావాలి. అన్నిరంగాల్లో విజయాలు సాధిస్తున్న మహిళలు ప్రోత్సహిస్తే మరింతగా రాణించగలరు. సానియా విూర్జా, సైనా నెహ్వాల్‌, పివి సింధు,సాక్షి, మాలావత్‌ పూర్ణా ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మనదేశంలో తమ పిల్లలు అడపిల్లలని చూడడం లేదు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు వెనకాడడం లేదు. ఎందరో ఆడపిల్లల తల్లిదండ్రుల తమ పిల్లలను అతి కష్టం విూద చదివిస్తున్నారు. వారికి వెన్నంటి నిలిచి ప్రోత్సహి స్తున్నారు. ఇలాంటి వారికి కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఫీజులు, విద్యా రుణాలు,క్రీడాంశాల్లో రాయితీలు ఇవ్వాలి. ఇలాంటి తల్లిదండ్రలును ప్రోత్సహించేందుకు సింధు విజయాన్ని ఓ స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడే ప్రధాని మోడీ ఇచ్చిన బేటీ పడావోకు అర్థం ఉంటుంది. సింధు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ స్ఫూర్తి పొందిన సింధు ఇంటి పక్కన చిన్నారులతో బ్యాడ్మింటన్‌ ఆడడం మొదలు పెట్టింది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు దగ్గర్లోని రైల్వే శిక్షకుడి వద్ద చేర్పించారు. తర్వాత మెరుగైన శిక్షణ కోసం గోపీచంద్‌ అకాడవిూలో చేర్పించారు. ఇలా కొన్నేళ్లుగా బ్యాడ్మింటన్‌ తర్ఫీదుని కొనసాగిస్తున్న సింధు ఎవరెస్ట్‌ శిఖరం లాంటి ఒలంపిక్స్‌ దశకు చేరుకుంది. ఒకవైపు ఆటల్లో.. మరోవైపు చదువులో రాణించడ మంటే కత్తివిూద సామే అయినా సింధు రెండిరట్లోనూ సత్తా చాటింది. ఒలింపిక్స్‌లో కాంస్యం, ఎన్నో సూపర్‌ సిరీస్‌లు, మరెన్నో గ్రాండ్‌ ప్రీ టైటిళ్లు సొంతం చేసుకున్న సైనా నెహ్వాల్‌ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ కోసం సైనా పోరాడు తున్న రోజుల్లో రాకెట్‌లా దూసుకొచ్చిన సింధు… ఆ ఘనతను పోటీ పడ్డ తొలిసారే కైవసం చేసుకుంది. ఈ ప్రత్యేకతతో ఒక్కసారిగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారిన సైనా సరసన చేరింది. ఇలాంటి వారందరిని గుర్తించి వారికి ప్రభుత్వపరంగా ప్రోత్‌ఆ
హం దక్కేలా చేయాలి.