మిషన్ భగీరథ ప్యాచ్ వర్క్ షురూ..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 16(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని 42 వ డివిజన్ రంగసాయిపేటలో శుక్రవారం మిషన్ భగీరథ ప్యాచ్ వర్క్ ల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ప్యాచ్ వర్క్ పనితీరును పరిశీలించారు. సుమారు నెల రోజులపాటు ప్యాచ్ వర్క్ డివిజన్లో కొనసాగుతాయని, ఎక్కడైతే మిషన్ భగీరథ పైప్ లైన్ ల కోసం తవ్వి వదిలేశారు వాటన్నింటి ప్యాచ్ వర్క్లు జరుగుతాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో ముత్తినేని రామ్మూర్తి ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area