మున్నూరు కాపు చైతన్య యాత్ర  విజయవంతం చేయండిమున్నూరు కాపు చైతన్య యాత్ర  విజయవంతం చేయండి

 

 

 

 

 

 

 

ఈనెల 19 నుండి చైతన్య యాత్ర ప్రారంభం
33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో పర్యటనకొండా దేవయ్య పటేల్
తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కుల బాంధవుల ఐక్యత కోసం మున్నూరు కాపు గర్జనను హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించనున్నట్లు  మున్నూరుకాపు సంఘం  రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య తెలిపారు, మంగళవారం స్థానిక ఆర్&బి విశ్రాంతి భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరు కాపుల హక్కుల సాధన కోసం మున్నూరు కాపు గర్జనను హైదరాబాద్ నడిబొడ్డున రెండు లక్షల మందితో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో మున్నూరు కాపు చైతన్య యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ. మున్నూరు కాపు లను ఐక్యం చేయుటకు సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . మొదటగా ఈనెల 19న వేములవాడ మొదటి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈనెల 22న నిర్మల్ జిల్లాలోని  ముధోల్,నిర్మల్,ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు,   మున్నూరు కాపులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మున్నూరు కాపు చైతన్య యాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముకాస కుల బాంధవులకు పిలుపునిచ్చారు,ఈసమావేశంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొట్టే హన్మాండ్లు.నిర్మల్ జిల్లా అధ్యక్షులు జుట్టు అశోక్,జిల్లా కోఆర్డినేటర్ లు గుర్రం సత్యం,అప్పాల వంశీ,మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మన్ పటేల్, జిల్లా అధ్యక్షులు గమ్ముల అశోక్,  తదితరులు పాల్గొన్నారు.