మూడు రోజుల పాటు ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు..
– వేడుకలను విజయవంతం చేద్దాం..
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14(జనం సాక్షి)
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం సెప్టెంబర్ 16,17,18 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు..అందుకు సంబందించి దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ గోపి,అదికారులు,పోలీస్ అదికారులతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు..వివిద శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేయలని అదికారులకు సూచించారు..ఈనెల 16 న వజ్రోత్సవాలు ప్రారంభమవుతాయని,అదే రోజు 15 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు..ర్యాలీలో ప్రజాప్రతినిదులు,అదికారులు,ఉద్ యోగులు,మహిళా సమైక్యల ఉద్యోగులు,అన్ని విబాగాల ఉద్యోగులు,ప్రజలు జాతీయ జెండాలతో పాల్గొంటారని,ర్యాలీ అనంతరం సమావేశం నిర్వహించబడుతుందన్నారు..ఈనెల 17 వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్ లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం,18 న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు..మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో యావత్ ప్రజానికం బాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నరేందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ,కార్పోరేటర్లు సురేష్ జోషి,కావటి కవిత రాజుయాదవ్,దిడ్డి కుమారస్వామి,ఎండి పుర్ఖాన్,ముఖ్య నాయకులు,అదికారులు పాల్గొన్నారు..