మెక్సికో సిటీలో ఢికొన్న మెట్రో రైళ్లు

మెక్సికో సిటీలో ప్రయాణికులతో నడుస్తున్న రెండు మెట్రో రైలు ఢకొని 12 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఘటన స్థలంలో 40 అగ్నిమాపక యంత్రాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు సిటీ పైర్‌ చీఫ్‌ రౌల్‌ ఏస్కుఇవెల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌కు తెలిపారు. గాయపడిన 12 మందిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మెక్సికో సిటీ మెట్రో సిస్టమ్‌ ట్వీటర్‌లో పేర్కొంది.
సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓసినియా స్టేషన్‌లోని 5వ లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ మెట్రోలో 12 లైన్లు ఉన్నాయి. ప్లాటు ఫారంలో ఆగివున్న రైలును వేగంగా వస్తున్న మరో రైలు ఢకొీట్టిందని మీడియా రిపోర్టు స్పష్టం చేసింది.