యూపిలో పనిచేయని ప్రియాంకాస్త్రం

చేజారిన అమేథీ…ఫతేపూర్‌ సిక్రీలో రాజ్‌బబ్బర్‌ ఓటమి

రాజీనామాకు సిద్దపడ్డ యూపి కాంగ్రెస్‌ అధ్యక్షుడు

లక్నో, మే24(జ‌నంసాక్షి): యూపిలో అనూహ్యంగా ప్రచార రంగంలోకి దిగి, ఓ దశలో వారణాసిలో ప్రధానిపై పోటీకి సై అన్న ప్రియాంక వల్ల ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ఆమె రాకతో ఒరిగేదేవిూ లేదని యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ఒకింత ఎకసక్కెంగా మాట్లాడినా, ఇప్పుడు అదే నిజమయ్యింది. అంతేనా అంటే అన్న రాహుల్‌ పోటీ చేసిన అమేథీ పరాజయం పాలయ్యింది. కనీసం కొన్నిసీట్లలో కూడ ఆప్రభావం చూపలేకపోయారు. సరికాదా యూపసి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ ఫతేపూర్‌ సిక్రీలో ఓటమి పాలయ్యారు. /ూజ్‌బబ్బర్‌ స్వయంగా యూపీలోని ఫతేపూర్‌ సిక్రీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌ ఛహర్‌ చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజ్‌బబ్బర్‌ నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు సిద్ధమై ఓటమి చవిచూడగా, అందుకు కొనసాగింపుగా 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ కోలుకోలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో, గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ ఉప ఎన్నికల్లోనూ పార్టీని ఆయన గెలిపించలేకపోయారు. వరుస వైఫల్యాలు ఆయన రాజకీయ కెరీర్‌పై తీవ్ర దెబ్బగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ యూపీసీసీ పదవికి రాజీనామా చేశారు. తన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పంపినట్టు తెలుస్తోంది. /ూజ్‌బబ్బర్‌ మూడుసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌బబ్బర్‌కు తొలుత మొరాదాబాద్‌ టిక్కెట్‌ కేటాయించినా, ఆ తర్వాత ఆయన కోరిక మేరకు ఫతేపూర్‌ సిక్రీ నియోజవర్గం కేటాయించారు. 2009లో ఫతేపూర్‌ సిక్రీ నుంచి పోటీ చేసిన రాజ్‌బబ్బర్‌ 9,936 ఓట్ల తేడాతో బీఎస్‌పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ్‌ చేతిలో ఓడిపోయారు. అయితే ఫిరోజాబాద్‌ ఉప ఎన్నికల్లో ఆయన తిరిగి ఎన్నికయ్యారు. అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా, యూపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో రాజ్‌బబ్బర్‌ ఘజియాబాద్‌ నుంచి పోటీ చేసినా బీజేపీ నేత జనరల్‌ వీకే సింగ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.