యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటం
-లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణవాదాన్ని వినిపించాలని నిర్ణయం
హైద్రాబాద్, నవంబర్20(.జనంసాక్షి): యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తి డి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిజామాబాద్ ఎంపీ మదుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. భేటీలో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం టీ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లడారు. తాజా రాజకీయ పరిస్థితులపై టీ ఎంపీలు తీవ్రంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణ పై తమ పార్టీ నిర్ణయం అనుకూలంగా నిర్ణయం తీసుకోక పోతే టీ ఎంపీలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుంటామని, తెలంగాణలో జగన్ ప్రభావం ఉండదని ఎంపీ రాజయ్య అన్నారు. తెంగాణ కోరుకునే వారికే ప్రజలు పట్టం కడతారని ఆయన పేర్కోన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు వచ్చిన వదంతులను తెలంగాన కాంగ్రెస్ ఎంపీలు ఖడించారు. ఎవరూ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం లేదని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీలో ఉండి తెంగాణ అంశం పై కేంద్రం పై ఒత్తిడి తెచ్చే దిశగా కృషిచేస్తా మన్నారు. కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని, దాని గురించి ఆలోచిస్తామన్నారు. 2014 లోపు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పని చేస్తామని ఎంపీలు వివరించారు. ఇవాళ తెలంగాన ఏర్పాటు పై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి పై అసంతృప్తి ఉన్న టీ ఎంపీలు ఈ నెల 22న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. ఈ భేటీలో కె కేశవరావు, మందా జగన్నాధం, రాజయ్య. గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ పాల్గొన్నారు.