రాజస్థాన్‌లోనూ రైతు రుణమాఫీ

మహిళలకు ఉచిత విద్య….3500 నిరుద్యోగ భృతి
మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌
జైపూర్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో ఓటర్లను ఆకట్టుకునేలా ఆకర్శణీయ పథకానలు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో రైతు రుణమాఫీకి పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే మహిళలకు ఉచిత విద్య అందిస్తామని, రైతు రుణాలను మాఫీ చేస్తామని, యువతకు ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హావిూ ఇచ్చింది. గురువారం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ ¬రా¬రీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఇటీవల భాజపా మేనిఫెస్టోను విడుదల చేసింది. కాగా పీసీసీ అధ్యక్షుడు పైలట్‌, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గె¬్లత్‌, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ హరీష్‌ చౌదరి, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. వృద్ధులైన రైతులకు పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అలాగే జర్నలిస్ట్‌ ప్రొటెక్షన్‌ చట్టం తీసుకొస్తామని హావిూ ఇచ్చింది. రైతులకు సంబంధించిన పరికరాలు జీఎస్టీ పరిధిలో నుంచి తీసేసేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. అలాగే యవతకు ఉద్యోగాలు కల్పించేందుకు పాటుపడతామని, నిరుద్యోగయువతకు రూ.3500 నిరుద్యోగ భృతి ఇస్తామని హావిూ ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గతంలోనే ప్రకటించారు. మేనిఫెస్టో కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆన్‌లైన్‌ వేదికగా దాదాపు 2లక్షల మంది ప్రజల అభిప్రాయం సేకరించిందని, ప్రజల అవసరాలు తెలుసుకుని దీన్ని రూపొందించామని పైలట్‌ వెల్లడించారు.