రాజస్థాన్‌ పోలీసులు మంచి ప్రయత్నం 

వాహనాలపై కులాల పేర్లు నిషేధం
జైపూర్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్న రాజస్థాన్‌ పోలీసులు తాజాగా మరో అడుగు ముందుకేశారు. వాహనాలపై ఇక నుంచి కులం పేరు, ఊరి పేరు కనిపించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పర్థలుపెరగకుండా, ఫలానా వారు ఫలానా కులం అన్న భేదాలు రాకేండా చూడాలని సంకల్పించారు. ఈ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా హర్షామోదం వస్తోంది. కులం, వృత్తులు, సంస్థలు, ¬దాలను వాహనాలపై ప్రదర్శించడం వల్ల సమాజంలో కులతత్వంతో పాటు బేధాభిప్రాయాలు పెరుగుతాయంటూ పౌర సమాజం సీఎం అశోక్‌ గెహ్లాట్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌ పోలీసులు తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాహనదారులు తమ సంస్థల పేర్లు, ¬దాలను కూడా వ్యక్తిగత వాహనాలపై ప్రదర్శించకుండా చూడాలని జోధ్‌పూర్‌, జైపూర్‌ పోలీస్‌ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. కాగా హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధించి, అదే సొమ్ముతో ఉచితంగా  హెల్మెట్‌ అందించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.