రాష్ట్ర స్థాయి ఖో ఖో విజేతలు గా రంగారెడ్డి,నల్లగొండ జిల్లాలు

 
 విజేతలకు ట్రోఫీ అందించిన జంపన ప్రతాప్, అరిగే మధుసూదన్
కంటోన్మెంట్  డిసెంబర్     జనం సాక్షి  న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ లో గతం మూడు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్రస్థాయి ఖో ఖో ఛాంపియన్ షిప్ నువ్వా నేనా అన్నట్టు రసవత్తంగా కొనసాగాయి. ఖో ఖో బాలికల విభాగంలో ప్రథమ విజేతగా నల్లగొండ బహుమతి కైవసం చేసుకుంది, ద్వితీయ బహుమతి రంగారెడ్డి, తృతీయ బహుమతి నిజామాబాద్ కైవసం చేసుకో గా. ఖో ఖో బాలుర విభాగంలో రంగారెడ్డి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది , ద్వితీయ బహుమతి వరంగల్, తృతీయ బహుమతి ఖమ్మం జట్లు కైవసం చేసుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ముఖ్య అతిథులుగా ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా కంటోన్మెంటు బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, సికింద్రాబాద్  డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, హాజరై ఫైనల్ మ్యాచ్ లను తిలకించి అనంతరం విజేతలకు బహుమతులను ప్రధానం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కంటోన్మెంట్ లో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, అరిగే రామస్వామి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అరిగే మధుసూదన్ లను ఘనంగా పూలమాలల తో సన్మానం చేశారు.
 ఈ కార్యక్రమం లో ఖో ఖో తెలంగాణ రాష్ట అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి, తెలంగాణ ఒలంపిక్ జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి,హైదరాబాద్ జిల్లా క్రీడాభివృద్ది అధికారి సుధాకర్, హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ సభ్యులు సదానంద్, పోచప్ప, కృష్ణమూర్తి, మునిరాజ్, జయరాజ్, కిషోర్ మరియు జంపన రవి, పేరుకే మహేందర్, జంపన పవన్, రాణా ప్రతాప్ యువసేన సభ్యులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.