రాహుల్‌ కలలు కనడంలో శిక్షణ తీసుకుంటున్నారు

New Delhi: Minister of Textiles Smriti Irani during the Monsoon Session of the Parliament, in New Delhi on Friday, July 20, 2018. (PTI Photo/Kamal Kishore)(PTI7_20_2018_000215A)

స్మృతి ఇరానీ ఎద్దేవా
కోల్‌కతా,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దేశంలోని అత్యున్నత పదవులకు కలలు కనడంలో శిక్షణ పొందిన
వ్యక్తిని ఎన్నుకోవద్దని ప్రజలను కోరారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న ఓ వీడియోను ప్రస్తావిస్తూ రాహుల్‌కు ఆయన పక్కనున్నవాళ్ళు ఎలా మాట్లాడాలో చెబుతారన్నారు. కలలు కనడానికి రాహుల్‌ శిక్షణ పొందుతారు. తాజా వీడియోనుబట్టి ఆయన తన సొంత మాటలనే నమ్మరని, ఏం మాట్లాడాలో తనకు చెప్పే ఇతరులపై ఆధారపడతారని అర్థమవుతోంది. ఎన్నికలు నిర్వహించే ఏ పదవికీ ఆయన అర్హుడు కాదని తెలుసుకోవడానికి దేశ ప్రజలకు ఇది హెచ్చరిక అని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలో రాహుల్‌ గాంధీ ఓ విూడియా సమావేశంలో వ్యవహరించిన తీరు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో రైతు రుణాలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన తర్వాత ఈ విూడియా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. విూడియాతో మాట్లాడేటపుడు రాహుల్‌ గాంధీ ఇతర కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అహ్మద్‌ పటేల్‌, జ్యోతిరాదిత్య సింథియాలతో మాట్లాడిన తర్వాత రాహుల్‌ విూడియాతో మాట్లాడినట్లు కనిపించింది. ఈ రోజుల్లో కలలు కనడానికి కూడా శిక్షణ పొందవలసి వస్తోందని ఎద్దేవా చేస్తూ స్మృతి ఇరానీ ఈ వీడియోను ట్వీట్‌ చేశారు.