రాహుల్‌ పప్పు నుంచి పప్పా అయ్యారు

– ఇక ఆయన పెళ్లి చేసుకోవచ్చు!
– కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే ఎద్దేవా
న్యూఢిల్లీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాహుల్‌ గాంధీ పప్పు నుంచి పప్పా అయ్యారని, ఇక ఆయన పెళ్లి చేసుకోవచ్చునంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి గద్దెనెక్కిన విషయం విధితమే. దీనిపై కేంద్ర మంత్రి, మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత రామ్‌దాస్‌ అథవాలే స్పందించారు. కాంగ్రెస్‌ సాధించిన విజయంతో ఇకపై రాహుల్‌ గాంధీ ‘పప్పు’ కాదని, ‘పప్పా’ (తండ్రి) అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన పెళ్లి చేసుకొని పప్పా అవ్వొచ్చని ఎద్దేవా చేశారు.’చాలా మంది రాహుల్‌ను పప్పు అని పిలుస్తుండడం తెలిసిందే. కాంగ్రెస్‌ విజయంతో ఆయన ఇప్పుడు పప్పాగా మారారని అన్నారు. నా సలహా ఏమిటంటే.. ఇక ఆయన త్వరగా పెళ్లి చేసుకొని నిజమైన పప్పా అవ్వొచ్చు అంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో భాజపా పరాజయం గురించి విశ్లేషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాష్ట్రాల్లో భాజపా పరాజయానికి ప్రధాని మోదీ కారణం కానే కాదని, అందుకు రాష్ట్ర భాజపానే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబరు 11న వెల్లడించిన ఎన్నికల ఫలితాల్లో 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 68 సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ భాజపా కేవలం 15 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. రాజస్థాన్‌లో 99 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. భాజపా 73 సీట్లకే పరిమితమైంది. మధ్యప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య ¬రా¬రీగా సాగిన పోరులో కాంగ్రెస్‌ 114 సీట్లను భాజపా 109 సీట్లను దక్కించుకున్నాయి.