రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు

మాజీ కేంద్రమంత్రి చిదంబరం
న్యూఢిల్లీ,డిసెబర్‌1(జ‌నంసాక్షి): మోదీ ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కన్నా ఇప్పుడు భారీ సంఖ్యలో కంపెనీలు దివాళా తీశాయన్నారు. గతంలో కన్నా ఇప్పుడు అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. అనేక అకౌంట్లు ఎన్‌పీఏలుగా మారాయని చిదంబరం ఆరోపించారు. చాలా వరకు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయన్నారు. ప్రతి చోటా సంక్షోభమే కనిపిస్తుందని మాజీ మంత్రి విమర్శించారు. ఆర్థిక ప్రగతి గురించి ప్రభుత్వం తప్పుడు అంశాలను వెల్లడిస్తోంది. డబుల్‌ డిజిట్‌ ప్రగతి ఎక్కడా జరగలేదన్నారు. గత నాలుగేళ్లలో ఇదెన్నడూ సాధ్యం కాలేదన్నారు.