రెపోరేట్‌ తగ్గించిన ఆర్‌బిఐ

వడ్డీ రేట్లు దిగొస్తాయంటున్న విశ్లేషకులు
ముంబై,అక్టోబర్‌ 4 (జనంసాక్షి):  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దసరా సందర్బంగా గుడ్‌ న్యూస్‌ అందించింది. రెపో రేట్‌ను మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ 25 బేసిస్‌ పాయింట్స్‌
తగ్గించడంతో రేపో రేట్‌ 5.15 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణ ముప్పు తప్పించుకునేందుకు, వృద్ధి వైపుగా అడుగులు వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్‌బీఐ రెపో రేట్‌ తగ్గించడంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. ¬మ్‌ లోన్‌, వెహికిల్‌ లోన్‌ సులభతరం కానున్నాయి. కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది. ఇదిలావుంటే దేశీయంగా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించింది. నెలకు ఒక్కసారి మాత్రమే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు ఈ అవకాశం మూడుసార్లు ఉండేది. ఇది ఖాతాదారులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం. ప్రభుత్వ డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌లో భాగస్వామ్యం కాని ఖాతాదారులు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చును.