రైతుల ఆదాయం పెంచేలా బిజెపి కసరత్తు

కార్యాచరణలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనుందని భాజపా సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ప్రధాని మోడీ కూడా ఈ దిశగా కసరత్తుచేస్తున్నారని వార్తలు వెలువుడుతున్నాయి. దిల్లీలో జరిగిన ఓ విూడియా సమావేశంలో భాజపా రైతు విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సింగ్‌ మస్త్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రావిూణాభివృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రైతుల సమస్యలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని వీరేంద్ర సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే రైతుల శ్రేయస్సు, అభివృద్ధి కోసం కేంద్రం త్వరలోనే పెద్ద నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి కింద ఏటా కొంతమొత్తం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై ప్రభుత్వం నుంచి ఇంత వరకూ స్పష్టత రాలేదు. తాజాగా వీరేంద్ర సింగ్‌ వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల ముందే కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

————–