రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న రబ్బీ ఖరీఫ్ సీజన్ల నిలువ ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి చేరవేయండి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ రాహుల్


వికారాబాద్ రూరల్ జూలై 15 జనం సాక్షి
రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న రబీ, ఖరీఫ్ సీజన్ కష్టం మిల్లింగ్ రైస్ (సీయంఆర్) ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వెంటనే పౌర సరఫరాల కార్పొరేషన్, ఎఫ్ సి ఐ కు వెంటనే డెలివరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) లింగ్యా నాయక్ అన్నారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిల్లర్ల వద్ద ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వెంటనే సివిల్ సప్లై కార్పొరేషన్ మరియు ఎఫ్ సి ఐ లకు కేటాయించిన ప్రకారం డెలివరీ చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, డీటీలు ప్రతిరోజు మిల్లులను సందర్శించి ప్రతి మిల్లరు మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం సీఎంఆర్ ( కాస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ అయ్యేవిధంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో పౌరసరఫల శాఖ అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమల, డిప్యూటీ తాసిల్దారులు, రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ బాలేశ్వర గుప్తా, సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు