ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది

 

 

 

 

 

న్యూఢిల్లీ : ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌కు వ్య‌తిరేకంగా యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో సెన్సెక్స్ 1800 పాయింట్ల‌కు పైగా ప‌డిపోయి 55,357.50 పాయింట్ల‌కు చేరింది. నిఫ్టీ 552.95 పాయింట్లు ప‌డిపోయి 16,510.30 పాయింట్లకు చేరింది. దీంతో భారత్‌లో వేలకోట్ల సంపద ఆవిరి అయిపోయింది.
ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధంతో ప్రీ ఓపెనింగ్‌లోనే మార్కెట్ 3 శాతానికి పైగా ప‌డిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ప్రారంభ‌మైన వెంటనే 4 శాతానికి ప‌డిపోయాయి. అన్ని రంగాల సూచీలు రెడ్ మార్క్‌లోనే ఉన్నాయి. తీవ్ర భయాందోళనల కారణంగా స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్‌లో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ స్టాక్‌లలో 50 పతనంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు బద్దలు కొట్టి 2.69 శాతం పతనంతో 36422 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలో మొత్తం 12 స్టాక్‌లు లాస్‌లో ట్రేడవుతున్నాయి.