లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన టిఆర్ఎస్ యువ నాయకులు
డాక్టర్ కల్వకుంట్ల సంజయ్* *ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం CMRF
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 13 :
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో
ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి, యామపూర్, వర్షకొండ,తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన టిఆర్ఎస్ యువ నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్ , ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తముగా సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతుందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు