*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16
(జనం సాక్షి)
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలోని డిడి నగర్ 12వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ ,పెన్నులు ,పెన్సిల్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం రాకేష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్
మెట్ పల్లి తరపున ప్రతి సంవత్సరం చాలా ప్రభుత్వ హాస్టల్లో గాని ప్రభుత్వ స్కూల్లో గాని ఉచితంగా బుక్స్ పెన్నులు పరీక్ష అట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని , అలాగే పేద ప్రజలకు లబ్ధి పొందేందుకు పలు సేవా కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు, రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ ,సెక్రెటరీ ఇల్లెందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూరి రాకేష్ , బివి నర్సింగారావు , నాంపల్లి చిన్న శ్రీనివాస్ ,కోటగిరి తిరుమల చారి , వెగ్యారపు వెంకటేశ్వర్లు ,గుండా రాకేష్ , ఆల్ రౌండర్ గంగాధర్ , నాంపల్లి శ్రీనివాస్ , ఇల్లెందుల వెంకటేశ్వర్లు , పాఠశాల హెచ్ఎం , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు లయన్స్ క్లబ్ సభ్యులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.