లైయన్స్ క్లబ్ సౌజన్యంతో ప్రొజెక్టర్ ఏర్పాటు…

ఫోటో రైటప్: ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తున్న దృశ్యం..
 వరంగల్ బ్యూరో : సెప్టెంబర్ 15 (జనం సాక్షి)
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం  తిమ్మంపేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ సౌజన్యంతో ప్రోజెక్టర్ అందించడం అభినందనీయమని తిమ్మంపేట గ్రామ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ అన్నారు.
గురువారం  మండలంలోని తిమ్మంపేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు, లయన్స్ క్లబ్, 50 వేల విలువైన ప్రొజెక్టర్ ను బహుకరించగా, స్థానిక సర్పంచ్ మోడెం విద్యాసాగర్  ప్రొజెక్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనీ, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రొజెక్టర్ ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు కావాల్సిన  సమాచారం అందుబాటులో ఉండినట్లయితే తప్పకుండ పాఠశాలలు అభివృద్ధికి,  విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
 50వేల విలువ గల ప్రోజెక్టర్ ఇచ్చినందుకు  తిమ్మంపేట గ్రామ విద్యార్థుల తరుపున లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ కత్తి యాకాంభ్రం, పంచాయితీ కార్యదర్శి రమేష్, విద్యాకమిటీ ఛైర్మెన్ రాజబాబు,  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల,   ఉపాధ్యాయులు సృజన, కత్తి చెందు పాల్గొన్నారు.
Attachments area