వరంగల్ లో బిజెపి యువ మోర్చా ర్యాలీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా యువ మోర్చా మరియు ఓ బి సి మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా తిరంగా ర్యాలీ ద్విచక్ర వాహనాలతో పోచమైదాన్ నుండి ఎంజీఎం సర్కిల్, పాపయ్యపేట్ చమన్, బట్టల బజార్ ఫ్లై ఓవర్, ఎస్ ఆర్ ఆర్ తోట, కరీమాబాద్, రంగషాయిపేట్ మీదుగా పడమరకోట నుండి తూర్పు కోటలోని స్వాతంత్ర సమరయోధుడు భత్తిని మొగిలయ్య గౌడ్ ఇంటి వరకు నిర్వహించడమైనది. ముందుగా మాజీ శాసనసభ్యులు శ్రీరాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన తర్వాత కిలా వరంగల్ లోని భత్తిని మొగిలయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి అతనికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. తదనంతరం సమావేశం పిట్టల కిరణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి సీనియర్ నాయకులు రత్నం సతీష్ షా,ఎర్రబెల్లి ప్రదీప్ రావు,కుసుమ సతీష్,అచ్చ విద్యాసాగర్,సభానుద్దేశించి మాట్లాడారు…
ఈ కార్యక్రమంలో యువ మోర్చ నాయకులు చిలుసాని సోమేశ్ వర్మ, అపురూప రజినిష్ ఓ బి స మోర్చా కూచన క్రాంతి, సముద్రాల పరమేశ్వర్, పూలెపాక మార్టిన్ లూథర్, పుప్పాల రాజేందర్, అల్లం నాగరాజు, చింతం రాజు, తాబేటి వెంకన్న, కందిమల్ల మహేష్, ప్రధాన కార్యదర్శి బాకమ్ హరి శంకర్, 37 వ డివిజన్ అధ్యక్షులు గోళ్ల రాజ్ కుమార్, ఎరుకల రఘునాథరెడ్డి, బైరి శ్యామ్, గడల కుమార్, సుమన్ ఖ, పొట్టి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు…
Attachments area