వాజ్‌పేయి అంతిమయాత్ర అంతిమయాత్ర ప్రారంభo
న్యూఢిల్లీ(జనం సాక్షి ): దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాజ్‌పేయి పార్థివదేహం వెంట ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్ర దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సాగనుంది. అటల్‌జీని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు భారీఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.