వాహనాలు మాయం.. వృద్ధుల ఇక్కట్లు..
క్షేమంగా చేర్చిన సర్పంచ్ రాంబాబు శంకర్
డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని నిశ్చయించారు.అందుకు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు,సభలు నిర్వహించాలని ఆదేశించారు.అందులో భాగంగా శుక్రవారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఏర్పాటుచేసిన వాహనాల్లో అమ్మపాలెం తెరాస శ్రేణులు,ఆసరా పెన్షన్ వృద్ధులు,వితంతువులు భారీగా తరలి వెళ్లినట్లు గ్రామ సర్పంచి ధరం సోత్ రాంబాబు శంకర్ తెలిపారు.కార్యక్రమం అనంతరం ప్రజలను తరలించిన వాహనాలు మాయమవడంతో అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు.ఆ జనసంద్రంలో ఇరువురు వృద్ధులు తప్పిపోయి హైరానా పడ్డారు. ఇతర వాహనాల్లో అందరిని క్షేమంగా గ్రామానికి చేర్చినట్లు తెలిపారు.సర్పంచ్ రాంబాయి శంకర్ వేరే వాహన సహాయం తీసుకొని వచ్చినట్లు తెలిపారు.పర్యవేక్షణ లోపం ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.