విజయవంతంగా అగ్ని-1 క్షిపణి ప్రయోగం

ఒడిశా : అణ్వస్త్రాలు మోసుకెళ్లే సామర్థ్యంగల అగ్ని-1 క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని  భద్రాక్‌ జిల్లా దామ్రా తీర ప్రాంతం నుంచి ఈ ఉదయం దీన్ని ప్రయోగించారు. 700 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను అగ్ని-1 చేదించగలదని డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు.