విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఉప సర్పంచ్: గందె ఉపేందర్ రావు
గరిడేపల్లి, సెప్టెంబర్ 16 (జనం సాక్షి):విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని కట్టవారిగూడెం గ్రామ ఉపసర్పంచ్ గందె ఉపేందర్ రావు సూచించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లివింగ్ స్టోన్ చర్చ్ పాస్టర్ ఊటుకూరి రాజు ఆధ్వర్యంలో దిరైస్ఆఫ్ మెర్సీ మినిస్ట్రీస్ వారి ఆర్థిక సహాయంతో నోటు పుస్తకాలు పెన్నులు ఇతర సామగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా దాతల సేవలను ఆయన కొనియాడారు. భవిష్యత్తులో కూడా గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో దాతలు
జయలాల్,స్తాన్లి ,సాజి ,అజయ్, ప్రేససిల్ల, ఫాస్టర్ ఊటుకూరి రాజు, గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు ఊటుకూరు వెంకయ్య, గ్రామ పెద్దలు కీత వెంకటేశ్వర్లు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు,పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.