విద్యుత్‌ కొరత, బొగ్గు ఉత్పత్తిలపై కేంద్రం అలర్ట్‌


మిగులు విద్యుత్‌ పక్క రాష్టాల్రకు ఇవ్వాలని సూచన
వర్షాల కారణంగా బొగ్గు సరఫరా నిలిచిందని భావన
త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆశాభావం
న్యూఢల్లీి,అక్టోబర్‌12 ( జనం సాక్షి ): దేశంలోని వివిధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత వల్ల విద్యుత్‌ కొరత ఏర్పడనుందని అనేక రాష్టాల్రు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ విద్యుత్‌ కొరతపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిగులు విద్యుత్‌ ఉత్పత్తి ఉన్న రాష్టాల్రు, కొరత ఉన్న రాష్టాల్రకు విద్యుత్‌ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ స్టేషన్ల వద్ద ఉన్న 15 శాతం అన్‌ అలకేటెడ్‌ కోటా నుంచి విద్యుత్‌ వాడుకోవాలని విన్నవించింది. మిగులు రాష్టాల్ర నుంచి ఎవరికి వారు ప్రయత్నం చేసుకోవచ్చిన
సలహా ఇచ్చింది. నిజానికి కేవలం బొగ్గుపైనే ఆధారపడడంతో బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నుంచి ప్రస్తుతం డిమాండ్‌ బాగా పెరిగింది. కొన్ని రాష్టాల్రు ప్రజలకు విద్యుత్‌ కోతలు పెడుతూ బయట రాష్టాల్రకు పవర్‌ అమ్ముతున్నారు. ఈ క్రమంలో కేంద్రం మిగులు కరెంట్‌ను పవర్‌ ఎక్స్చేంజిలలో అమ్మితే ఆ రాష్టాల్ర కేటాయింపులు తగ్గించేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంగళవారం రాష్టాల్రకు లేఖ రాసింది. కాకపోతే… మంగళవారం నుంచి ఇక్కడ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడే ప్రమాదముంది. దక్షిణ ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ సమాచారం ప్రకారం… ఎన్‌టీటీపీసిలో ఒకరోజు పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తికి 28,500 టన్నుల బొగ్గు నిల్వలు కావాలి. సోమవారం 30,272 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. అంటే, కేంద్రం నుంచి ర్యాకులు వస్తే మాత్రమే నిరాటంకంగా ఉత్పత్తి సాగుతుంది. ఇక… ఆర్‌టీపీపీలో రోజుకు 21 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా.. ఒక్క యూనిట్‌ మాత్రమే పనిచేస్తున్నం దున 9,917 మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగించారు. ఇంకా 66,525 టన్నుల బొగ్గు నిల్వ ఉంది. కృష్ణపట్నంలో పూర్తి సామర్థ్యంలో 19 వేల టన్నులు వినియోగించాల్సి ఉండగా.. ఒక్క యూనిట్‌ మాత్రమే పనిచేస్తున్నందున 8,134 మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగించారు. ఇంకా 1,51,123 టన్నుల నిల్వలున్నాయి. దేశంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో సగటున 3 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉండగా… వీటిలో 17 ఎª`లాంట్లలో ఇప్పటికే బొగ్గు నిల్వలు ఖాళీ అయిపోయాయి. 21 ప్లాంట్లలో మరొక్క రోజులో ఖాళీ అయిపోతాయి. 18 పలాంట్లలో 2 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. మిగిలిన వాటిలో అటూ ఇటుగా వారానికి సరిపడా బొగ్గు అందుబాటులో ఉందని కేంద్ర విద్యుత్‌ అథారిటీ (సీఈఏ) తెలిపింది. గత ఆగస్టులో ఇవే థర్మల్‌ ప్లాంట్లలో 13 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటం గమనార్హం. ప్రైవేటు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ’కరోనా’ తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత జాతీయంగా, అంతర్జాతీయంగా మళ్లీ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. 2019తో పోలిస్తే గత రెండు నెలల్లో విద్యుత్‌ వినియోగం ఏకంగా 17శాతం వరకూ పెరిగింది. అదే సమయంలో బొగ్గుకు కొరత ఏర్పడిరది. పరిస్థితి అసాధారణంగానే ఉందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మరో ఐదారు నెలలు కొనసాగే అవకాశం ఉందన్నారు. దేశంలో బొగ్గు కొరత సాధారణం కంటే అధికంగా ఉందని, అయితే ఇది విద్యుత్తు సంక్షోభానికి దారితీయదని తెలిపారు. కొద్దిరోజుల్లోనే డిమాండ్‌కు తగినట్లు బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గుతున్నందున రవాణా క్రమంగా మెరుగవుతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు… మూడు నాలుగు రోజుల్లోనే బొగ్గు ఉత్పత్తి సాధారణ స్థితికి వస్తుందని బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొనడం గమనార్హం. దిగుమతి చేసుకునే బొగ్గు ధర ఒక్కసారిగా భగ్గుమందని… కేవలం ఆ బొగ్గుపై ఆధారపడే థర్మల్‌ ప్లాంట్లు ఉత్పత్తిని ఆపివేశాయని చెప్పారు. విద్యుత్‌ సంక్షోభం ప్రభావం ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉందని పారిశ్రామిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ కొరత కారణంగా చమురు నుంచి ఆహార పదార్థాల వరకూ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయని చెబుతున్నారు. ఈ సంక్షోభం ఇలాగే మరికొంత కాలం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సంక్షోభ నివారణకు కోల్‌ ఇండియా కూడా చర్యలు చేపడుతోంది. నిల్వలు తక్కువగా ఉన్న కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. మరోవైపు విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించాలని కోరుతూ టాటా పవర్‌ ఢల్లీి డిస్టిబ్యూష్రన్‌ లిమిటెడ్‌ (టీపీడీడీఎల్‌) ఢల్లీిలోని తన
వినియోగదారులకు సమాచారం పంపించింది. బొగ్గు సరపరా పరిమితంగా ఉన్నందున మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకూ విద్యుత్‌ సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుందని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించింది. బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని కోరింది. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌కు కృత్రిమ కొరత సృష్టించినట్లుగానే ఈ విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని జైన్‌ ఆరోపించారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకోని బొగ్గు, గ్యాస్‌ సరఫరా చేయాలని కోరారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.20కి పెంచారని, దాన్ని నియంత్రించాలని విన్నవించారు.తీవ్ర బొగ్గు కొరత కారణంగా పంజాబ్‌లోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు విద్యుత్తు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తెలిపింది.