విధుల్లో పోలీసుల సెల్‌ఫోన్ల వినియోగంపై ఆంక్షలు


చెన్నై,నవంబర్‌27(జ‌నంసాక్షి):  పోలీసులు విధుల్లో ఉన్న సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించడంపై తమిళనాడు పోలీస్‌ ఉన్నతాధికారులు నిషేధం విధించారు. సెల్‌ఫోన్లు వాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో..ఎస్‌ఐ క్యాడర్‌ కింది స్థాయి పోలీసులు ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు డీజీపీ టీకే రాజేంద్రన్‌ తెలిపారు. వీవీఐపీ బందోబస్తు, ఉత్సవాలు, సున్నితమైన ప్రాంతాలు, క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే సమయంలో వాట్సాప్‌, ఇతర సోషల్‌విూడియాలతో విధులను నిర్లక్యం చేస్తున్నారని రాజేంద్రన్‌ అన్నారు. ఇలాంటి సమయాల్లో ఇక నుంచి పోలీసులు సెల్‌ఫోన్లు వాడొద్దని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఎస్‌ఐ క్యాడర్‌ పైస్థాయి అధికారులు కూడా అధికారిక కార్యకలాపాల కోసం మాత్రమే సెల్‌ఫోన్లను వాడాల్సి ఉంటుందని రాజేంద్రన్‌ అన్నారు.