వ్యక్తులకు తప్ప కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో వ్యక్తులకు తప్ప కార్యకర్తలకు ప్రాధాన్యత లేదని కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విసృత సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ అమరవీరులకు సమావేశంలో సంతాపం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సంతోషంగా లేరని ఆయన పేర్కొన్నారు. బీసీలకు పార్టీ తరపున  ఒక ప్రణాళిక అమలు చేయాలని ఆయన సూచించారు. షర్మిల పాదయాత్రకు వందలాదిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. పొన్నం ప్రసంగం మధ్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.