శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్ర (దసరా)మహోత్సవములు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో శ్రీ కనకదుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముఖ్యఅతిథిగా విచ్చేసి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు శ్రీ భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు గ శ్రీ కనకదుర్గ మాత దేవాలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలు నుండి శ్రీ కనకదుర్గ దేవాలయం నిత్య పూజలతో పాటు శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అన్నారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజతో మొదలుకొని చండీ హోమం నిత్యం గత 25 సంవత్సరాలు నుండి ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు శ్రీ కనకదుర్గ దేవాలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ ఈనెల 26 సోమవారం నుండి వచ్చేనెల గురువారం వరకు శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు అన్నారు మహా అన్న ప్రసాద కార్యక్రమం మూడు రోజులు నిర్వహిస్తామని అన్నారు చండీ హోమంలో పాల్గొని శ్రీ కనకదుర్గ దేవి కృపకు పాత్రులు కాగలరని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గద్దల వేలాద్రి సర్వరియా సురేష్ కుమార్ కొంక వెంకటేశ్వరరావు ఆకోజు జగన్నాథ చారి జంగం ప్రభాకర్ సింగతి జ్యోతి బస్ గాత్రం రవికుమార్ సాంబ వసంతరావు గూడ శారద పప్పు విజయ సింగతి స్రవంతి