సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 16(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమని కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, బొమ్మల కట్టయ్య విగ్రహాలకు పూలమాలవేసి ముందుగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మల అంబేద్కర్ భవన్ కమిటీ అధ్యక్షులు కదారి కుమార్. భవన్ కమిటీ పెద్దలు ఎరుకల మహేందర్ నీలం మల్లేశం గజ్జ మొందెయ్య అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు జక్కుల రాజు మహిళా నాయకులు తరాల రాజమని.. నీలం స్వామి ఒగ్గుల.నరేంధర్ గాలి రాజు ప్రసాద్ అశోక్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area