సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియోలు అడగడంపై మోదీ అసహనం

modi-oct-06
న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి):పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని పలు ప్రాంతాల్లోని టెర్రరిస్టు లాంచ్‌ ప్యాడ్ల(దాడికి దిగబోయేముందు ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్‌ 28,29 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ కు సంబంధించిన వీడియోల విడుదలపై పలువురు కేంద్ర మంత్రులు ఇష్టారీతిగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీ భేటీలో ప్రధాని.. వీడియోల విడుదలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు చేయొద్దని మంత్రులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీకి చెందిన సీఎంలు, ఇతర నేతలు కొందరు ‘మోదీ ఛాతి కొలతల’పై మాట్లాడటాన్ని కూడా పీఎం ఆక్షేపించినట్లు సమాచారం.సర్జికల్‌ దాడుల వీడియోలు విడుదల చేయాలంటూ ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌ సహా మరికొన్ని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో అసలు వీడియోలను విడుదల చేయాలా? వద్దా? అనేదానిపైనా కేబినెట్‌ కమిటీ చర్చించింది. దాడుల వీడియోలను ఆర్మీ అధికారులు బుధవారమే కేంద్ర ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. పలు మల్లగుల్లాల అనంతరం ప్రధాని మోదీ.. వీడియోలు నూటికి నూరు శాతం ఆర్మీకి సంబంధించిన విషయాలని, వాటిని విడుదల చేయాలా, వద్దా అనేది కూడా ఆర్మీ అధికారులే నిర్ణయిస్తాని అన్నట్లు తెలిసింది.భేటీకి కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తోపాటు రక్షణ, విదేశీ వ్యవహరాల శాఖల మంత్రులైన మనోహర్‌ పారీకర్‌, సుష్మా స్వరాజ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ దోవల్‌, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం(అక్టోబర్‌ 2న) స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ విూడియాతో ‘వీడియోలు విడుదల చేస్తాం’అని ప్రకటిచిన సంగంతి విదితమే.

అటు పాకిస్థాన్‌తోపాటు ప్రతిపక్షాల సభ్యులు కూడా పాకిస్థాన్‌ భూభాగంలో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్‌ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేయాలని,

దాడులు జరిగినట్లున్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్‌ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. తన రెండు రోజుల పర్యటనను ముగించుకొని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కూడా వచ్చిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలోని రక్షణ పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశానికి పలువురు సీనియర్‌ అధికారులు కూడా హాజరయ్యారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పది రోజుల తర్వాత భారత ఆర్మీ పాక్‌ భూభాగంలోకి దూసుకెళ్లి సెప్టెంబర్‌ 29న సర్జికల్‌ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని వస్తున్న డిమాండ్లను ముందునుంచి కేంద్ర తోసిపుచ్చింది. అయితే, ఇటీవలె రాజ్‌ నాథ్‌ సింగ్‌ వేచి చూడండని చెప్పడంతో వాటిని విడుదల చేస్తారనే అభిప్రాయం ఏర్పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడి ఫుటేజీ విడుదల అంశంపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.