సాదాసీదాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్
ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా ప్రతిపాదనలు
వేలన జీవులకు స్వత్ప ఊరట..పన్ను చెల్లింపు దారులకు నీరసం
వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అగ్రభాగాన నిలుపుతామని ప్రకటన
పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం
2022`23 మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు
ద్రవ్యలోటు 6.9 శాతం నుంచి 4.5 శాతానికి తీసుకురావాలని లక్ష్యం
లక్షకోట్ల ప్రత్యేక నిధి ద్వారా రాష్టాల్రకు వడ్డీ లేని రుణాలు
నేషనల్ హైవేస్ నెట్‌వర్క్‌కు 25 వేల కిలోవిూటర్లు పరిధి
అందుకోసం రూ.20 వేల కోట్ల సవిూకరిస్తున్నట్లు వెల్లడి
సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట..డ్రోన్లతో పంటల రక్షణ
దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ ద్వారా భూముల రిజస్టేష్రన్ల
డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి
పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు
60 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి
న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి): ఎటువంటి మెరుపులు..వేతన జీవులకు ఊరడిరపులు..ఆదాయపు పన్నుల్లో శ్లాబుల వంటి ఉత్సాహం లేకుండా సాదాసీదాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నాలుగో సారి తన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఐదు రాష్టాల్ర ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఉత్సాహకరం గా ఉంటుందన్న భావనలేకుండా ముందుకు సాగారు. ఆమె బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. 2022`23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్ పునాదిగా అభివర్ణించారు. పారదర్శకమైన సవిూకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాందిగా పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను.. కళ్లకు కట్టేలా వివరిస్తూ పద్దును సమర్పించారు నిర్మలా సీతారామన్.. పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేస్తుందని వెల్లడిరచారు. 2022 నాటికి స్వాతంత్యంª`ర వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుండగా 2047 వరకు ఈ 25 ఏళ్ల కాలాన్ని ఆమె అమృత కాలంగా అభివర్ణించారు. ఈ కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలను ఆవిష్కరించారు. ప్రధాని గతిశక్తి యోజన, సవిూకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అనే నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు పార్లమెంటుకు తెలిపారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడిరచిన నిర్మల.. పట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.రాష్టాల్రకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్టాల్రకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కేంద్రమంత్రి కల్పించారు. ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. సేంద్రియ వ్యసాయం, నిరుద్యోగులకు ఊరట వంటి విషయాలతో కొంత ఉత్సాహం కలిగించారు. 2022`23 మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లుగా చూపారు.
ద్రవ్య లోటు 6.9 శాతంగానూ…25`26 నాటికి 4.5 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా వేశారు. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించుకున్నారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌జోరుగా సాగుతోంది. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి పెట్టి, వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరిస్తామన్నారు. ఆమె ప్రసంగం కొనసాగు తున్నంత సేపు సభలో ప్రధాని మోడీ,మంత్రులు బల్లలు చరిచి ఉత్సాహ పరిచారు. పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక వృద్ధి కొనసాగేలా బడ్జెట్ రూపకల్పన చేశామని, వచ్చే 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో 60 లక్షల ఉద్యోగాలు సృష్టించామని, వేగంగా ప్రభుత్వ రంగా సంస్థల ప్రైవేటీకరణ చేపడుతామని వివరించారు. ఈ బడ్జెట్ నాలుగు ప్రధాన అంశాలు చేర్చామన్నారు. మొదటి ప్రధాని అంశం పిఎం గతి శక్తి అని, ఇందులో ఏడు రకాల అంశాలపై దృష్టి పెడుతామని, పిఎం గతి శక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివన రులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత లాంటి మొత్తం ఏడు అంశాలపై దృష్టి పెట్టామన్నారు. నేషనల్ హైవేస్ నెట్‌వర్క్‌కు 25 వేల కిలోవిూటర్లు పెంచుతామని, ఇందుకు రూ.20 వేల కోట్ల సవిూకరిస్తున్నామని, దేశంలో నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఉన్నాయని, పర్వత ప్రాంతాల్ని కలిపేలా పిపిపి మోడల్లో పర్వత్‌మాలా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి సాంకేతిక హంగులు గా మార్చామని, డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు నిర్వహిస్తు న్నామన్నారు. వచ్చే మూడేళ్లలో 400 న్యూజనరేషన్ వందే భారత్ రైళ్లను నడిపిస్తామని, నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో ప్రోత్సాహం ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పంటల మద్దతు ధర కోసం రూ.2.37 లక్షల కోట్లు ఖర్చు చేశామని, తృణధాన్యాల సంవత్సరంగా 2023 ప్రకటించామని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. డిజిటల్ హెల్త్ సిస్టమ్ కోసం జాతీయ విధానం తీసుకొచ్చామని, ఈ స్టడీకి బడ్జెట్లో ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. మానసిక ఆరోగ్య వ్యవస్థ కోసం జాతీయ విధానం ఏర్పాటు చేస్తామని, నైపుణ్య అభివృద్ధికి డిజిటల్ వ్యవస్థతో రూపకల్పన చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఇల మార్కెటింగ్ కోసం కొత్త పోర్టల్ ఏర్పాటు చేశామని, ఎంఎస్‌ఎంఇల క్రెడిట్ గ్యారంటీకి రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. పిఎం ఆవాస్ యోజన కింద రూ.60 వేల కోట్ల రూపాయలతో 3.8 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. త్వరలో ఎల్‌ఐసిలో పబ్లిక్ ఇష్యూ రాబోతోందన్నారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని, పేద, మధ్య తరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్‌లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాయపన్ను రిటర్న్‌ల దాఖలులో నవీకరణఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్ పన్నుప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపును ప్రకటించారు.
విద్యుత్ రంగ సంస్కరణల కోసం ప్రత్యేక ప్రణాళిక, నిధులువిద్యుత్ సంస్థలను పునరుత్తేజ పరిచేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్టాల్ర ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటుప్రత్యేక నిధి ద్వారా రాష్టాల్రకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీరూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీకరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పన జరుగుతుందని ప్రకటించారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్‌బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడిరచారు. యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తాం అని మంత్రి చెప్పారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్ బాండ్లుగిప్ట్ ప్రకటించారు. సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాల యాలకు అవకాశం ప్రకటించారు. స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చారు. అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన చేస్తారు. పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్ల కేటాయింపు.. ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడిరది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వెన్నుదన్నుగా అవసరమైన ప్రభుత్వ పెట్టుబడులు మూలధన పెట్టుబడుల కోసం రాష్టాల్రకు కేంద్రసాయం అందించనుంది. దేశీయంగా సౌర విద్యుత్ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు కేటాయింపు ఇచ్చారు. బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు ప్రకటించారు. ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం తీసుకుని వచ్చారు. గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం వర్తింపచేస్తారు. విద్యా, పారిశ్రామిక అనుసంధానంతో..విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం చేస్తారు. విద్యా, పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టగలమన్నారు. డీఆర్‌డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశంరక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయంసమృద్ధి సాధించేలా కృషి సాగుతుందన్నారు.
ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలుమౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై దృష్టి సారించామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు. వచ్చే ఐదేళ్లలో మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు చేస్తున్నట్లు వెల్లడిరచారు. వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్ చేపడతామని అన్నారు. డ్రోన్‌లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన. పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన..ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్ ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు. అంగన్‌వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ.
తెలుగు రాష్టాల్ల్రో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా`కావేరి నదుల అనుసంధానానికి ఎª`లాన్. గంగా నదీ తీరంలో 5 కిలోవిూటర్ల మేర
సేంద్రీయ సాగు వంటివి ఉన్నాయని తెలిపారు. అన్ని పోస్టాఫీసుల్లో ఏటీఎం సహా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై చిప్ ఆధారిత పాస్ పోర్టులు. కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటివి ప్రకటించారు. డిజిటల్ పేమెంట్, నెట్‌బ్యాంకింగ్ సేవలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం ఇస్తామన్నారు. ఈ`వెహికల్స్ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం ఏర్పాటు చేస్తామని,. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు చేస్తామని అన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ్య వ్యవస్థ కోసం జాతీయ విధానం ప్రకటించారు. 10 రంగాల్లో క్లీన్‌ఎనర్జీ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు వంటి వాటిని ప్రకటించారు.