సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలి * సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామ్ చందర్
టేకులపల్లి, ఆగస్టు 3 (జనం సాక్షి ): అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు గుగులోతు రామ్ చందర్ డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలపై ఒప్పందాలు కుదిరాయని,ఈ ఒప్పందాలను అమలు చేయకుండా యజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమను దోచుకుంటూ చట్టబద్ధమైన వేతనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయనప్పటికీ సింగరేణి అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులను యజమాన్యం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రామ్ చందర్ డిమాండ్ చేశారు